SnatchApp అనేది, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ప్రజలు మరియు వ్యాపారాలు ప్రపంచవ్యాప్తంగా సురక్షితంగా సమాచారవినిమయము చేసుకోవడానికి ఉపయోగపడే ఉచిత మెసేజింగ్ మరియు కాలింగ్ యాప్.
ఇది, ఎన్‌క్రిప్ట్ చేయబడిన మెసేజ్‌లు, క్విక్ వాయిస్ మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఎమోజీలు, కాల్స్ మరియు వీడియో కాల్స్ ను ఒక చివర నుండి మరో చివరకు పంపించడానికి మరియు అందుకోవడానికి ఒక సులువైన మరియు సురక్షితమైన మార్గము.
SnatchApp వద్ద మా లక్ష్యం అతి సులువైనది: తాము శ్రద్ధగా చూసుకునే వారితో ఎల్లప్పుడూ చేరువగా సంప్రదింపుతో ఉండేందుకు ప్రజలకు సహాయపడడం. ఆ లక్ష్యాన్ని ఫలప్రదం చేయడానికి గాను, మేము ఉచితంగా, సురక్షితమైన, వాడకందారుకు స్నేహపూర్వకమైన మరియు ప్రతిచోటా లభించగల ఒక ప్రోడక్టును రూపొందించాము. మీరు మీ మెసేజ్‌లను మీ ఉపకరణాలన్నింటి నుండీ ఒకే సమయంలో సైతం అందుకోవచ్చు.
SnatchApp చాట్‌బాట్స్ ను కూడా సమగ్రం చేస్తుంది, మరియు దాదాపుగా ప్రపంచంలోని ప్రతి దేశములోనూ బిలియన్ల కొద్దీ మెసేజ్‌లను ప్రైవేటుగా మరియు సురక్షితంగా మార్పిడి చేసుకోవడానికి వీలు కలిగిస్తుంది.
SnatchApp 53 భాషలలో లభిస్తోంది.
SNATCHAPP ఎందుకు ఉపయోగించాలి:
• ఉచిత వాయిస్ కాల్స్ మరియు వీడియో ఎన్‌క్రిప్ట్ చేయబడిన కాల్స్: మీ స్నేహితులు మరియు కుటుంబముతో, వాళ్ళు మరొక దేశములో ఉన్నప్పటికీ కూడా, సంప్రదింపులో ఉండటానికి మీ పిసి లేదా స్మార్ట్‌ఫోన్ ఉపయోగించండి. SnatchApp, మీ సెల్యులార్ ప్లాన్ యొక్క వాయిస్ మినిట్స్ ని ఉపయోగించుకోకుండా మీ ఫోన్ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ ను ఉపయోగించుకుంటుంది (లభ్యతను బట్టి 4G/3G/2G/ఎడ్జ్ లేదా వై-ఫై), కాబట్టి, మీరు ప్రతి మెసేజ్ కు లేదా కాల్ కు చెల్లించాల్సిన పని లేదు. (గమనిక: వై-ఫై మీద కాల్స్ అన్నీ ఉచితము. ప్రామాణిక డేటా ఛార్జీలు వర్తించవచ్చు).
• సురక్షిత మెసేజింగ్ మరియు విశ్వసనీయమైన కాంటాక్టులు: మెసేజ్ లు మరియు కాల్స్ అన్నీ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ (ఒకచివరి నుండి మరో చివరకు గుప్తీకరణ)తో రక్షించబడి ఉంటాయి. మీరు సరియైన వ్యక్తితోనే మాట్లాడుతున్నట్లుగా నిర్ధారణ చేసుకోవడానికి, మీ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ యొక్క సురక్షతను మీ కాంటాక్టులతో సరి చూసుకోండి.
• గ్రూప్ చాట్ మరియు కాల్స్: మీకు సన్నిహితమైన వ్యక్తుల సమూహాల(గ్రూపుల)తో సంపర్కములో ఉండటానికి SnatchApp ఉపయోగించండి. గ్రూప్ కాల్స్ చేయండి. పెద్ద వీడియోలు, టెక్స్ట్ (విషయం), ఏ రకమైన డాక్యుమెంట్ అయినా, ఫోటోలు, ఆడియో, లొకేషన్ మెసేజ్‌లు, ఇంకా మరెన్నింటినో గ్రూపుతో పంచుకొని ఆనందించండి.
• SnatchApp వెబ్: మీ వెబ్ బ్రౌజరుపై కూడా SnatchApp అందుబాటులో ఉంటుంది. https://web.snatchapp.me
• బాట్స్ కు ప్రాధాన్యత ఇవ్వబడే ఒక మార్గం: మీరు గనక ఒక చాట్‌బాట్ ను ఏర్పరచుకొని, వినియోగించుకోవాలని ఆలోచిస్తూ ఉంటే, మీరు SnatchApp యొక్క ప్రైవేటు మరియు సురక్షితమైన అప్లికేషన్ ఉపయోగించుకొని మీ బాట్ తో వినియోగం, పరీక్ష మరియు సంభాషణ జరుపుకోవచ్చు.
వాస్తవ-సమయపు లొకేషన్ (రియల్ టైమ్ లొకేషన్): మీరు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని ఇతరులకు చెప్పడానికి బదులుగా, ఏ సంభాషణకైనా మ్యాపులను సమగ్రం చేసుకోవడానికై కేవలం రియల్ టైమ్ లొకేషన్ షేరింగ్ వాడండి.
• మీ కంఠస్వరమును మార్చండి: కొంత మసాలా జోడించి మీరు మీ ప్రియమైనవారిని ఆశ్చర్యచకితుల్ని చేయాలనుకుంటున్నారా? మీ కంఠస్వరం ధాటిని మార్చడానికి SnatchApp మీకు వీలు కలిగిస్తుంది. మార్చుకున్న మీ స్వరాన్ని వింటూ వినోదములో తేలియాడండి!
రక్షణ:
• సురక్షితము: ఒక్కో సంభాషణకూ SnatchApp పై మెసేజ్‌లు అన్నీ 256-బిట్ సిమ్మెట్రిక్ ఎఇఎస్ ఎన్క్రిప్షన్, 2048-బిట్ ఆర్ఎస్ఎ ఎన్క్రిప్షన్ యొక్క సమ్మేళనము మరియు ఒక సురక్షిత కీ మార్పును ఉపయోగించి ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. SnatchApp ద్వారా పంపించబడిన ఏ సందేశాలనూ మేము చదవలేము. SnatchApp ద్వారా మీరు పంపించే సందేశాలు మరియు మీడియా ఫైళ్ళను మేము స్వంతం చేసుకోము.
• తుడిపివేత: మీ ఉపకరణము నుండి మెసేజ్‌ల నుండి ఇమేజ్‌లు, వీడియోల వరకు మీ మొత్తం కంటెంటు అంతా మళ్ళీ వాపసు పొందడానికి వీలు లేకుండా తొలగించబడుతుంది.
• అదృశ్యమయ్యే మెసేజ్‌లను సక్రియం/నిష్క్రియం చేయండి: డిఫాల్ట్‌గా, ఒక సంభాషణలో పంపించబడిన మెసేజ్‌లు అన్నీ, వాటిని చూసిన తర్వాత అదృశ్యమైపోతాయి.
• టైమరును అమర్చుకోండి: మీ మెసేజ్‌లు అన్నింటిపై సమయ గడువును అమర్చుకోండి.
• క్షేమంగా కనెక్ట్ అవండి: మీ అడ్రస్ బుక్ ఎల్లప్పుడూ ప్రైవేటుగానే నిలిచి ఉంటుంది, మా సర్వర్లపై ఎప్పటికీ నిక్షిప్తము కాదు. గూగుల్, యాహూ, ఔట్లుక్, ఇమెయిల్, ఫోన్ తో ఫ్రెండ్ ఫైండర్ సమగ్రపరచబడి ఉంటుంది.
• 100% ఉచితం, ప్రకటనలు ఉండవు: SnatchApp ఉచితం మరియు ఖచ్చితంగా ఉచితంగానే ఉంటుంది.
----------------------------------------------------------
SnatchApp గురించి మరింత సమాచారానికై, మా అధికారిక వెబ్సైట్ కు వెళ్ళండి.
http://snatchapp.me